Top25 Podupu Kathalu With Answers
Top25 Podupu Kathalu With Answers
Top25 పొడుపు కథలు With Answers
ఈ సృష్టిలో మానవుడేనాడు పుట్టాడో పొడుపు కథ ఆనాడే పుట్టింది. మానవుని పట్టుకతోనే సమస్యలు మొదలయ్యాయి. సమస్యల్ని పొడుపుకథలు ప్రతి బింబించాయి. ఇంకేం పొడుపుకథ ఓ సమస్య అయి కూర్చుంది. ఈ సమస్య ముడి విప్పడానికి సృష్టించిన మానవుడే ఆలోచించాల్సి వచ్చింది. ఆ ఆలోచనలకు ఒక రూపం వచ్చేసింది. ఇంకేం అది ఒడు పయ్యింది. పొడువు పొడిచిన వాడూ మానవుడే, పొడుపు విడిచిన వాడూ మానవుడే. పొడుపు కథా కర్తా-వ్యవహర్తా మానవుడే అనడంలో సందేహం లేదు. అయితే కర్త ఒక్కడా పదుగురా అనేదే తేలని విషయం. ఇటీవలి కాలానికి చెందిన కొన్ని పొదుపు వద్యాల్ని మినహా యిస్తే అతి వేలంగా ఎదిగి, వటవృక్షంలా విస్తరించిపోయిన జాన పదుల పొడుపు కథలకు కర్తలెవ్వరో కన్ను పొడుచుకున్నా కనిపించరు. చిటారుకొమ్మలోని మిఠాయి పొట్లమైనా దొరుకుతుందేమో కాని పొడుపుకథాకర్త చిక్కడూ దొరకడు. అయితే వ్యవహర్తలు మాత్రం పల్లె పల్లెలో దొరుకుతారు. అడిగిన వెంటనే ముచ్చట్లు పెడుతూనే మురిపాలొలికిస్తూనే పొడుస్తారు. తమ తరువాతి తరం వారు అదేవిఢంగా పొడపడానికి ముళ్లడొంకలు తీస్తారు. పూల బాటలు వేస్తారు.

1. ఎంత మూసినా చప్పుడు కావు. ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
Answer: కనురెప్పలు.
2. ఎండిన దొకటి, పండిన దొకటి కాలిన దొకటి, ఈ మూడు ఇంటికి అలంకారం. ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
Answer: తాంబూలం.
3.ఎక్కడైనను అంతను తిరుగు చుండు, పలికిన పలుకదు, నవ్విన నవ్వును, భయపడిన భయపెట్టు. ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
Answer: నీడ.
4. ఎక్కలేని చెట్టుకు గంపెడు కాయలు. ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
Answer: మిరప చెట్టు.
5. ఎగిరిన ఎగురును, పోయిన పోవును, నడచిన నడచును, నోట మాట లేదు. ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
Answer: నీడ.
6. ఎగువో పలకా దిగువో పలకా, పలకల క్రింద మెలికల పామూ, పామును పట్టా పగ్గం లేదూ, పగ్గాలు పలికే సిగ్గొదినా. ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
Answer: నాలుక.
7. ఎనిమిది చేతుల ఏబ్రాసి, ఎపుడు తిరిగే సోబ్రాసి వెన్నున జందెం వేళ్ళాడుతూ, తీసిన కొద్దీ తేర్లాడు. ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
Answer: రాట్నం.
8. ఎనిమిది కాళ్ళు నాలుగు కొమ్ములు, అడ్డంగా నడచును అసుర కాదు, శిరసు, తోకలేదు, జీవం మాత్రం ఉంది. ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
Answer: పీత.
9. ఊరంత కలిసి చిప్పెడు గుగ్గిళ్ళు తినలేరు. ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
Answer: వడగళ్ళు.
10.ఊరంతా తిరిగి మూల కూచుంది. ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
Answer: చీపిరి.
11. ఉరుములు మెరుపులు ఉచ్చిత పండు, తొంబై తిన్నా తొడిమలు లేవు. ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
Answer: దోసెలు.
12. ఉరుములు మెరుపులు, ఉటంగి జాణలు కదలక మెదలక పొదలో గ్రుడ్లు పెట్టె. ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
Answer: కుక్క గొడుగు.
13. ఊరిలో కలి, ఇంటిలో కలి, వంటిలో కలి. ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
Answer: చాకలి, రోకలి, అకలి.
14. ఊర అవతల, ఉత్తరాదవతల, జమ్మి చెట్టవతల, జాలారవతల, పిలజులేని పిట్ట, గుడ్లు పెట్టింది. ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
Answer: పుట్ట కొక్కులు.
15. ఊళ్ళో హుసేనుగాడు, అడవిలో ఆసుగాడు, డొంకలో డోలుగాడు. ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
Answer: కుక్క.
16. ఎంగిలి వచ్చి వెన్నుమీద పడింది. ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
Answer: చాకలి మూట.
17. ఎండకు ఎండాని పువ్వు, వానకు తడవని సుందారి పువ్వు అదిలేక గడవదు సుండారి పువ్వు. ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
Answer: రూసాయి బిళ్ళ.
https://youtube.com/shorts/RL1_wFPhOXg?si=Dj-q3wFPbd0RiMsc
18. అందరికి ఒకే కొడుకు, ఒకే కూతురు. ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
Answer: పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు.
19. అందరికి ముఖం చూపుతాను, కాని వీపు గోకు వాళ్ళతో విరోధం. ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
Answer: అద్దం.
20. అంబుకు చెంబు, చెంబులో చారెడు నీళ్ళు. ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
Answer: కొబ్బరికాయ.
21. అంబులో పుట్టింది, జంబులో పెరిగింది. అరచేతి కొచ్చింది, అంతరించి పోయింది. ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
Answer: పేను.
22. అంథాల మీద కుంథాలు, కుంఖాల మీద కుడితొట్టి
కుడిలొట్టి మీద గుండ్రాయి, గుండ్రాయి మీద కోరింత
కోరింత మీద ఆరిక ఆవురూ, ఆరిక ఆవురు గడ్డిలో
ఆవులు వేయీ. ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
Answer: కాళ్లు, పిరుదలు, కడుపు, తల, కండ్లు, వెంట్రుకలు, పేలు.
23. అక్క ఇంటిలో దీపం పెడితే, చెల్లెలింటిలో పొగ వేస్తుంది. ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
Answer: పేడ పొయ్యి.
https://youtu.be/QxzfsxqFXxQ?si=LiZNIHVADUAE8vKs
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article. https://www.binance.com/en-NG/register?ref=JHQQKNKN
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.