తెలుగు సామెతలు నిత్యజీవితంలో

Table of Contents

తెలుగు సామెతలు నిత్యజీవితంలో

తెలుగు సామెతలు నిత్యజీవితంలో

తెలుగు సామెతలు అనేవి మన తెలుగు భాష పుట్టినప్పటి నుంచి వాడుకలో ఉన్నాయి. వీటిని చాలా సందర్భాలలో విరివిగా వాడుతారు. ఏదైనా ఒక సందర్భాన్ని గురించి ఒక వాక్యంలో చెప్పదలచినప్పుడు ఈ సామెతలను వాడుతారు. సామెతలలో మన తెలుగు భాష యొక్క సౌందర్యం అణువణువునా ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఈ సామెతలు నీతికి సూచనగా హాస్యం కలగలిపి ఉంటాయి.

సామెతలు ఆయా ప్రాంతాల్లో భావాన్నిబట్టి భాషనుబట్టి చాలా రకాలుగా ఉన్నాయి. సామెతలు ఒకరి చేత రచించబడ లేదు అవి రోజువారి సంభాషణల నుంచి పుట్ట బడినవి. సామెత లేని మాట ఉప్పు లేని కూరవలె చప్పగా ఉంటుంది. సామెతలు ఏదైనా ప్రసంగానికి మరింత వన్నె చేకూరుస్తాయి.

తెలుగు సామెతలు నిత్యజీవితంలో
తెలుగు సామెతలు నిత్యజీవితంలో

ఇవి మన పూర్వీకులు మనకు ప్రసాదించిన అమృతపు రసగుళికలు. సామెతలను లోకోక్తులు, చలోక్తులు, హాస్యోక్తులు, రసోక్తులు అని రకరకాల పేర్లతో వీటిని పిలుస్తారు. ఇంగ్లీషులో వీటిని proverbs అని పిలుస్తారు. ఈ తెలుగు సామెతలు  నేను మా అమ్మమ్మ, నాన్నమ్మ దగ్గర నుంచి సేకరించాను. ఈ సామెతలను వారు ఎప్పుడు వారి రోజువారి సంభాషణ లో ఉపయోగిస్తూ ఉంటారు.

1. అసలే కోతి, ఆపై కల్లు త్రాగింది, దానికి తోడు తేలు కుట్టింది.

2. అసలే లేదంటే పెసరపప్పు వండమన్నాడంట ఒకడు.

3. ఇల్లు పీకి పందిరేసినట్లు.

4. ఆ కత్తికి పదునెక్కువ.
25 సామెతలు వాటి అర్థాలు
5. ఏ గాలికి ఆ చాప.

6. ఇంటికి ఇత్తడి పొరుగుకు పుత్తడి.

7. ఉత్త కుండకు ఊపులెక్కువ.
https://youtube.com/shorts/3xxozSHNlt4?si=xh_gNBa3zHKyw0K_

8. కాసు ఉంటె మార్గం ఉంటుంది.

9. కుక్క నోటికి టెంకాయ అతకదు.
10. కొత్తోకా వింత పాతొక రోత.

2 thoughts on “తెలుగు సామెతలు నిత్యజీవితంలో”

Leave a Comment